నీతా అంబానీకి అరుదైన గౌరవం

326
Nita Ambani
- Advertisement -

రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ ఎన్నో సహాయసహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆహరం అందించడమే కాకుండా.. ఆమె ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తం లో విరాళాలు అందించారు. ముంబై లో తొలి కోవిద్ ఆసుపత్రి ని కట్టించారు. అంతే కాదు.. ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు అందించారు. ఈ సేవలకుగాను నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ టౌన్ అండ్ కంట్రీ విడుదల చేసిన టాప్ గ్లోబల్ ఫిలాంత్రపిస్ట్స్ 2020 జాబితాలో చోటు దక్కింది. నీతాతో పాటు టిమ్ కుక్, ఆఫ్రా విన్‌ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, ది లాడర్ ఫ్యామిలీ, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డిపాక్రియో వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో నీతా ఒక్కరికే స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా కష్టాల్లో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న సమయంలో వీరంతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ కొనియాడింది. లక్షలాది మంది ఆకలి తీర్చడంతో పాటు ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. కష్టకాలం వచ్చిన సమయం లో ఆదుకునేలా రిలయన్స్ ఫౌండేషన్ ను తీర్చిదిద్దామని ఆమె అన్నారు. కరోనా కష్టకాలం లో ఆమె అందించిన సహాయానికి.. అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు రావడాన్ని గౌరవం గా భావిస్తున్నానని అన్నారు. టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్‌ టాప్ ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో చోటు దక్కడం ఆనందం గా ఉందని అన్నారు. ఎపుడు అవసరం వచ్చినా.. మా ప్రభుత్వానికి.. ప్రజలకు సాయమందిస్తూనే ఉంటామని ఈ సందర్భం గా నీతా అన్నారు.

- Advertisement -