అంధుల మహిళా క్రికెట్ జట్టుకు రిలయన్స్ ఫౌండేషన్ కీలక ప్రోత్సాహం అందించింది. ఇటీవల అంధుల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకొని దేశానికి గర్వకారణమైన అంధుల మహిళా క్రికెట్ టీమ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ తరఫున నీతా అంబానీ రూ.5 కోట్ల నజరానా ప్రకటించారు. ఈ బహుమతిని ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.
ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరై క్రీడాకారులను అభినందించారు. అడ్డంకులను అధిగమించి ప్రపంచకప్ సాధించడం అసాధారణ విజయమని వారు ప్రశంసించారు.
నీతా అంబానీ మాట్లాడుతూ, అంధుల మహిళా జట్టు సాధించిన ఈ విజయం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. మహిళా క్రీడాకారులకు, ముఖ్యంగా దివ్యాంగ క్రీడాకారులకు తమ ఫౌండేషన్ ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ గౌరవం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read;TTD:రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్!

