ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందన్న విమర్శలు రోజురోజుకి పెరిగపోతున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలోనూ అంబానీ,అదానీల ఆస్తులు రెట్టింపు సంఖ్యలో పెరిగిపోవడం, నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రైవేటికరణ పేరుతో వీరికే రుణం వచ్చేలా..పొందేలా మోదీ సర్కార్ నిర్ణయాలు ఉండటం అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
తాజాగా ఈ అపర కుబేరుల భార్యలు ప్రొఫెసర్లుగా మారనున్నారట. నీతా అంబానీ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య కాగా.. మరో వ్యాపారవేత్త గౌతం అదాని సతీమణి ప్రీతి. నిత్యం వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉండే వీళ్లిద్దరూ త్వరలో ప్రఖ్యాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్లుగా చేరనున్నారట.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీహెచ్‌యూలో విజిటింగ్ ప్రొఫెసర్లుగా ఉండటానికి వారికి ఏ అర్హత ఉన్నదని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ రెండు కుటుంబాల కోసం మోడీ సార్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.