- Advertisement -
వాతావరణ శాఖ తీపి కబురునందించింది. మరో 24 గంటల్లో కేరళకు నైరుతీ రుతుపవనాలు రానున్నట్లు ఐఎండీ వెల్లడించింది. రేపటి నుండి వర్షాకాలం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. మే 31వ తేదీ నాటికి కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకుంటాయని తొలుత ఐఎండీ అంచనా వేసింది. కానీ ఒక రోజు ముందే వర్షాలు కేరళకు చేరుకోనున్నట్లు తాజాగా ఐఎండీ తెలిపింది.
వివిధ వాతావరణ అంశాల ఆధారంగా నైరుతీ ఆగమనంపై ఐఎండీ ప్రకటన చేసింది. ఆరేబియా సముద్రంపై నైరుతీ పవనాలు బలపడినట్లు అంచనా వేశారు. దీంతో తేమశాతం పెరిగింది. గత ఏడాది జూన్ 8వ తేదీన నైరుతీ కేరళ తీరాన్ని తాకగా 2022లో కూడా మే నెలలోనే కేరళకు నైరుతీ చేరుకుంది.
Also Read:240కి పైగా దేశాల్లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’
- Advertisement -