- Advertisement -
కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ చేపట్టామని తెలిపారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధికశాఖ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె…ఆర్ధిక ప్యాకేజీపై ఓ కొలిక్కివచ్చామని తెలిపారు.
పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని వెల్లడించారు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి వచ్చిందన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరం జీఎస్టీ, ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు జూన్ 30 వరకు పొడగించామని అమె పేర్కొన్నారు.
మూడు నెలలపాటు ఇతర బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాపై ఛార్జీలు ఎత్తివేస్తామని…ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30కి పొడిగించినట్లు తెలిపారు.
- Advertisement -