నవంబర్ 30 వరకు ట్యాక్స్ చెల్లించేందుకు గడువు

258
nirmala sitaraman
- Advertisement -

కొన్నివారాల పాటు అన్ని వర్గాల ప్రజలతో చర్చింని ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిర్మలా…సెక్టార్ల వారీగా ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు.

ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇస్తామని… అక్టోబర్ 31 వరకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రాల పూచీకత్తుతో డిస్కంలకు రుణాలు ఇస్తామన్నారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు నవంబర్ 30 వరకు పెంచినట్లు తెలిపారు. రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు వస్తుందన్నారు. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా పేర్కొన్నారు. 12 నెలల వరకు రుణాలపై తిరిగి చెల్లింపులు చేయనక్కర్లేదన్నారు.

- Advertisement -