బడ్జెట్‌ పై నిర్మలా సీతారామన్ కసరత్తు!

2
- Advertisement -

బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. డిసెంబర్ 21-22 తేదీల్లో రాష్ట్రాల ఆర్ధికమంత్రులతో సమావేశం ఉండనుందని తెలుస్తోంది. ఈ సమయంలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నవేళ సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. కానీ దీనిని మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది.

గత నెలలో, ఆరోగ్య మరియు జీవిత బీమా జీఎస్టీపై మంత్రుల బృందం (GoM) టర్మ్ జీవిత బీమా పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను మరియు జీఎస్టీ నుండి సీనియర్ సిటిజన్‌ల ఆరోగ్య బీమాను మినహాయించడంపై విస్తృతంగా అంగీకరించింది.

Also Read:KTR:ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?

- Advertisement -