దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తుది తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. ముగ్గురు దోషులకు ఉరి శిక్షను ఖరారు చేసింది. 2012లో ఢిల్లీలో దేశం ఉలిక్కిపడేలా నిర్బయ ఘటన జరిగింది. దోషులు క్షమించరాని నేరం చేశారని పేర్కొంది సుప్రీం. తమకు విధించిన ఉరిని యావజ్జీవ శిక్షగా మార్చాలని దోషులు వేసిన రివ్యూ పిటిషన్‌ని కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్ధించింది న్యాయస్థానం.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల ఫార్మసీ విద్యార్థినిపై పాశవికంగా ఆరుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమెను నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాలతో చివరి వరకు పోరాడిన యువతి కన్నుమూసింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చారు.
ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురిలో 2013 మార్చిలో తీహార్ జైల్లో ఉన్న రామ్ సింగ్ తీహార్ ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితుతులకు ఉరిశిక్ష విధించింది.