త్వరలో ఇండియాకు నీరవ్‌..

285
- Advertisement -

ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్‌మోదీని అప్పగింతకు మార్గం సుగుమమైంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను రూ.11వేల కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి యూకే తలదాచుకుంటున్న మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే కోర్టు అనుమతినిచ్చింది.

దీంతో నీరవ్‌మోదీని భారత్‌ తీసుకువచ్చేందుకు లైన్‌క్లియర్‌ అయ్యింది. యేళ్లుగా ఎదురుచూసిన భారత దర్యాప్తు ల ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. వేల కోట్ల రూపాయల మోసం మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో నీరవ్‌ మోదీని నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

నీరవ్ మోదీని భారత్‌కి రప్పించడం ఇంకెంతో దూరంలో లేనట్టే అని భావించాల్సి ఉంటుంది. నీరవ్ మోదీని భారత్ కి రప్పించేందుకు బ్రిటన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోన్న భారత్.. అతడిని ఇండియాకు తీసుకురాగానే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నట్టు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి బ్రిటన్‌కి పారిపోయిన కేసును ఎదుర్కోంటున్న నీరవ్‌తోపాటుగా అతడి సమీప బంధువు మోహుల్ చోక్సీ సైతం రెండో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

మోదీ సంకుచితత్వాన్నికి నిదర్శనం

బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..

దాయాది జట్టు ఫైనల్‌కు చేరింది..

- Advertisement -