ఎట్టకేలకూ..స్పందించిన టోపీరాజా..

206
Nirav Modi Latest Breaking News..
- Advertisement -

వజ్రాల వ్యాపారి నిరవ్‌మోదీ ఎట్టకేలకు స్పందించారు. సీబీఐ పంపిన డిజిటల్ సమన్లకు సమాధానంగా..భారత్‌ వచ్చి విచారణను ఎదుర్కోలేనని చేప్పేశారు. తన ఆస్తులను, పత్రాలను సీబీఐ, ఈడీ స్వాధీనం చేసుకోవడం ద్వారా దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Nirav Modi Latest Breaking News..

‘‘నా కార్యాలయంలోని సర్వర్లను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం మీకు తెలుసు. దీంతో చట్టప్రకారం నన్ను నేను సమర్థించుకునేందుకు వీలుగా నా ప్రాథమిక హక్కును సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏ సమాచారం అందించలేని వికలుడిగా మారిపోయాను’’ అని తన సమాధానంలో పేర్కొన్నారు నిరవ్‌మోదీ.

కాగా.. భారత్‌ కు తిరిగి రావడానికి తిర్సకరిస్తూ.. తన భద్రత, పారదర్శక దర్యాప్తు నిర్వహించే విషయంలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకూ సీబీఐ సమాధానం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా..పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కి రూ.11వేల కోట్లకు పైగా టోపీ పెట్టి ప్రస్తుతం పరారీలో ఉన్నారు నిరవ్‌మోదీ.

- Advertisement -