1300 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులకు టోకరా వేసి నీరవ్ మోడీ విదేశాలకు ఉడాయించిన విషయం తెలిసిందే. తాజాగా కెనడాకు చెందిన ఓ వ్యక్తిని నకిలీ వజ్రాలతో మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పాల్ ఆల్పాన్సో అనే ఓ వ్యక్తికి నకిలీ వజ్రాలు అంటగట్టిన కారణంగా పాల్ పెళ్లి పెటాకులైనట్టు వార్తలు వచ్చాయి. 2012లో పాల్‌తో నీరవ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్లు లాస్ ఏంజిల్స్‌లో కలుసుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో పాల్ నీరవ్ ను తన నిశ్చితార్ధానికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ నిశ్చితార్ధానికి నీరవ్ నుంచి 2 వజ్రాల ఉంగరాలు పాల్ తీసుకున్నాడు. అయితే ఆ ఉంగరాలు వజ్రాలవి కాదని గాజురాళ్లవని అతనికి కాబోయే భార్య నిర్ధారించుకుంది. వజ్రాల పేరుతో రాళ్లుఅంటగట్టాడని ఆమె పాల్‌ను తిరస్కరించింది. నీరవ్ మోసం కారణంగా ఆ పెళ్లి పెటాకులైంది. పాల్ చేసేది లేక నీరవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పాల్ అమ్మకం చేసిన వజ్రాలన్నీ నిజమైనవా కాదా..? అన్న సంశయం పలువురిలో బయలుదేరింది.