రైతులను బెదిరించాడు. ఎకరానికి రూ.20లక్షల పలికే భూమిని కేలవం రూ.10వేలకే బెదిరించి మరీ లాక్కున్నాడు. అందుకే తమకు జరుగుతున్న అన్యాయంపై పిడికిలి బిగించేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని వారి మాటల్లో చెప్తూనే.. నీరవ్‌మోదీకి బుద్దిచెప్పేందుకు ముందడుగేశారు మహారాష్ర్టకు చెందిన రైతులు.
ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12వేల కోట్లకు పైగా మోసగించి, ఇప్పుడు తప్పించుకుంటూ తిరుగుతున్న నిరవ్ మోదీకి మహారాష్ర్ట రైతులు భారీ షాకిచ్చారు. మహారాష్ర్ట లో అహ్మద్‌నగర్ జిల్లాలో నిరవ్ మోదీకి చెందిన 250 ఎకరాల భూమిని అక్కడి రైతులు స్వాధీనం చేసుకున్నారు.
లక్షలాది రూపాయలు విలువచేసే తమ భూములను చిల్లరడబ్బు విసిరి నిరవ్ మోదీ సాంతం చేసుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎకరం భూమి రూ.10 వేలకు అమ్మాలంటూ రైతులను బెదిరించి లాక్కున్నారు. వాస్తవానికి అప్పుడు ఇక్కడ ఎకరం భూమి రూ.20 లక్షలు పలికింది…’’ అని సాచివ్ అనే ఓ రైతు వెల్లడించారు.
మహాత్మా ఫోటో, జాతీయ జెండాలు చేతబూని… సదరు భూములు నాగళ్లతో దున్ని రైతులు పంటలు వేశారు. అంతేకాదు తమ భూములపై పెత్తనం చేస్తున్న ‘ల్యాండ్ మాఫియా’ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.