Niranjan:చంద్రబాబుతో రేవంత్ కుట్ర!

29
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణను ఆగంజేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారు..? అని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్…గ‌త ప‌దేండ్ల నుంచి ఎవ‌రి మానాన వారు బ‌తుకుతున్నారు కానీ మానిన గాయాల‌ను మ‌ళ్లీ ర‌గిల్చేందుకు చంద్ర‌బాబు, రేవంత్ క‌లిసి కుట్ర‌లు చేస్తున్నారు అని దుయ్యబట్టారు. అప‌రిష్కృత అంశాల మీద చ‌ర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవి. కానీ అలా లేవు. ప‌రోక్షంగా తెలంగాణ‌ను ప‌రిపాలించేట‌టువంటి కుట్ర ప్రారంభ‌మైందన్నారు.

టీఎస్‌పీఎస్సీ వ‌ద్ద కంచెలు వేయించి అమానుషంగా నిరుద్యోగుల‌ను అరెస్టు చేశారు. చివ‌ర‌కు ర‌హ‌దారిపై వెళ్తున్న దంప‌తుల‌ను, రైతుల‌ను కూడా అరెస్టు చేశారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టో అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉందా..? మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారెంటీలు ఏమ‌య్యాయి..? అని నిరంజ‌న్ రెడ్డి నిల‌దీశారు.

Also Read:ఇక ట్రూ కాలర్ అవసరం లేదు!

- Advertisement -