బర్త్ డే గిఫ్ట్‌గా యూరియా బ్యాగ్!

10
- Advertisement -

గతంలో ఉల్లిగడ్డల కొరత మీద సెటైర్లు ఉండేవి.. తాజాగా తెలంగాణలో యూరియా కొరత నేపథ్యంలో బస్తా బహుమతిగా ఇచ్చి రైతులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ పరిస్థితి వచ్చినందుకు ఈ రేవంత్ ప్రభుత్వం సిగ్గుపడాలి. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి రోజూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు… వీరంతా సిపాయిలు అయితే రైతులకు యూరియా అందించడంలో ఎందుకు విఫలం అవుతున్నారు ? చెప్పాలన్నారు.

వేములవాడలో స్నేహితుడి పుట్టిన రోజుకు గిప్ట్‌గా యూరియా బ్యాగ్ ఇచ్చారు…చివరికి అప్పటి ఢిల్లీ ప్రభుత్వం కూలిపోవడానికి ఉల్లిపాయ కారణం అయింది అన్నారు నిరంజన్ రెడ్డి.

పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు వేములవాడ రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని శత్రాజుపల్లి గ్రామంలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో ఒక యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు.

ఒకప్పుడు యూరియా కోసం ఇంత కష్టం ఉండేది కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కోసం పడిగాపులు కాస్తే ఒకరికి కేవలం ఒకే యూరియా బస్తా ఇస్తున్నారు. దీంతో ఈ యూరియా కొరతపై రైతులు వినూత్నంగా పుట్టినరోజున బహుమతిగా ఇచ్చి నిరసన తెలిపారు.

Also Read:సాగర్.. 14 గేట్లు ఓపెన్

- Advertisement -