పదేపదే వక్రీకరిస్తే చరిత్ర మారిపోదు అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…వాస్తవం వాస్తవం లాగానే ఉంటుందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా సీఎం మాట్లాడుతున్నారు .ప్రజలు రేవంత్ ను అసహ్యించుకుంటున్నారు …నిన్న నారాయణ పేట ,వికారాబాద్ ల్లో పర్యటించినపుడు సీఎం ఏదైనా ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు …అయితే ఏం ప్రకటించకుండా కేసీఆర్ పై ఎప్పటి మాదిరిగానే అసభ్య భాషలో నిందించారు
..సీఎం కేసీఆర్ హయం లో పూర్తయిన భవనాలను రేవంత్ ప్రారంభించారు అన్నారు.
ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయాల్సిన ప్రారంభాలను సీఎం చేస్తున్నారు ..పది నెలలుగా పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ను సీఎం ప్రారంభించారు ..ఇలాంటి అభివృద్ధి మోడల్ తో వెళ్తున్న సీఎం రేవంత్ మమ్మల్ని చర్చకు రమ్మంటున్నారు ..ఇలాంటీ సీఎం తో ఏం చర్చచేస్తారు ?..అంతా కేసీఆర్ విద్వంసం చేశారని తప్పుడు మాటలు అన్నారు ..లక్షల ఎకరాల పంట కళ్ల ముందు ఉంది ..కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదంటున్నారు ..రేవంత్ సీఎం అయ్యాక ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా
..అంతా ప్రజల అనుభవం లో ఉంది ..పాలమూరు బిడ్డను కనుక తనను కాపాడుకోవాలని రేవంత్ అంటున్నారు అన్నారు.
ఎందుకు కాపాడుకోవాలి రేవంత్ ను పాలమూరు బిడ్డలకు రైతు బంధు ,రైతు భరోసా ఇవ్వనందుకా ?,…పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను అడ్డంకులమధ్య కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో దాదాపుగా పూర్తి చేశారు ,..పన్నెండు వందలు కోట్ల రూపాయల తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు ..అయినా పది నెలలుగా రేవంత్ ఏం చేస్తున్నారు ..పన్నెండు లక్షల ఎకరాల కు నీళ్లిచ్చే ప్రాజెక్టు ను రేవంత్ నిర్లక్ష్యం చేశారు ..ఉద్దండ పూర్ ద్వారా గ్రావిటీ కాలువ ద్వారా కొడంగల్ కు నీళ్లు ఇవ్వొచ్చు ..అయినా కొడంగల్ నారాయణ్ పేట లిఫ్ట్ తెచ్చారు ..కళ్ళ ముందు ప్రాజెక్టులు కనిపిస్తుంటే కేసీఆర్ ఏం చేయలేదంటే ఎట్లా ?..అరుపులు పెడ బొబ్బలతో కేసీఆర్ చేసిన అభివృద్ధి ని రూపుమాపుతావా ?..ఎక్కడికి వెళ్లినా సీఎం అని మరచి రేవంత్ కేసీఆర్ పై ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకుంటున్నారు
..ప్రజలకు ఈ తిట్లతో ఏమైనా మేలు జరుగుతుందా ?..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి రేవంత్ కు ఎందుకు కడుపు నొప్పి ?…కేసీఆర్ కు నీ మీద కక్ష ఎందుకు ఉంటుంది ?..కేసీఆర్ ది విలక్షణ మనస్తత్వం ..తన మీద పోటీ చేసిన ప్రత్యర్థులను అక్కున చేర్చుకున్న మనస్తత్వం కేసీఆర్ ది ..కేసీఆర్ ను ఎందరో తిట్టారు ..వారి మీద కక్ష కట్టారు ..కేసీఆర్ పదేళ్ల పాలన పై విమర్శలు చేస్తే ఏం లాభం ఉండదు అన్నారు.
Also Read:మహాశివరాత్రి … ప్రత్యేక బస్సులు
పోతిరెడ్డి పాడుపై ఆరుగురు టీ ఆర్ ఎస్ మంత్రులు రాజీనామా చేస్తే కాంగ్రెస్ మంత్రులు నీళ్ల తరలింపునకు హారతి పట్టారు ..కాంగ్రెస్ నేతలే మాతృ ద్రోహానికి పాల్పడ్డారు ..చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టులను పరిహసించారు ..ఆయన శిష్యుడిగా రేవంత్ అదే చేస్తున్నారు .జగన్ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తెచ్చింది కేసీఆర్ కాదా ?…ప్రాజెక్టులు ఆపాలని పీఎం మోడీ కి కేసీఆర్ లేఖ రాసింది నిజం కాదా ..సీఎం గా వచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు.

