రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…రైతులకు వెంటనే ఎకరానికి రూ. 7500 సాయం అందించాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీకి కేబినెట్ ఆమోదించినందుకే సంబురాలు చేస్తున్నారు. సినిమావాళ్ల సోపతి వల్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారన్నారు. రూ. 2 లక్షల రుణం తీసుకున్న రైతుల వివరాలు వెల్లడించాలని…. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తారా..? లేదా..? రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామని…ఈ హామీలన్నింటిని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుందని…అలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 8 నెలలైనా ఇంకా రుణమాఫీ చేయలేదు కానీ అప్పుడే కేబినేట్లో రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నామని పాలాభిషేకాలు చేయించుకుంటున్నారని విమర్శించారు.మోడీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కకావికలం అయిందని…కాంగ్రెస్ వైఫల్యం వల్లనే దేశ ప్రజల్లో చీలిక ఏర్పడిందన్నారు.
Also Read:ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్‌కి కోమటిరెడ్డి