రైతుబంధు పథకంలో షరతుల్లేవు:నిరంజన్ రెడ్డి

675
niranjan reddy
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో షరతుల్లేవని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన ఇప్పటివరకు 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు.

మొత్తం రైతు బంధు పథకం కింద 56.76 లక్షల మంది అర్హులు ఉన్నారని …రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించామని…ఈ ఏడాది నుంచి ఎకరానికి పంటకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి అనేక షరతులు ఉన్నాయని…రాష్ట్రంలో 33 లక్షల మంది రైతులను అర్హులుగా నిర్ణయించారు. కానీ 75 వేల మంది రైతులకు రూ. 125 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు.

- Advertisement -