Niranjan Reddy:రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా?

21
- Advertisement -

రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రూ.2 లక్షల రుణమాఫీపై రైతాంగాన్ని మభ్యపెట్టడంపై తప్పుపట్టిన నిరంజన్ రెడ్డి… ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం అన్నారు. అబద్దాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్దాలతో పాలన సాగిస్తోందన్నారు. ఈ రోజు లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ.. రూ. 2 లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా! అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారని…యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారు.. రైతుభరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. వానాకాలం రైతు భరోసా ఊసే లేదు.. కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ.7500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారు.. రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చారు .. 10 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2500 చొప్పున బాకీ పడింది .. దీని అమలుకు ఏడాదికి రూ.41,700 కోట్లు కావాలన్నారు. 40 లక్షల మంది ఫించను దారులు, దివ్యాంగుల ఏడు నెలలుగా నెలకు రూ. 2 వేల చొప్పున బాకీ పడిందని…30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ.4 వేల చొప్పున బాకీపడిందన్నారు. రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నారు .. వారికి రూ.15 వేల చొప్పున రూ.975 కోట్లు బాకీపడింది..రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పింది .. రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారు .. ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6240 కోట్లు బాకీపడిందన్నారు. కోటి 30 లక్షల టన్నులకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.6500 కోట్లు బోనస్ ఎగ్గొట్టారు … సేకరించిన ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వలేదు…రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకుంటున్నారు .. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ.లక్ష వరకు బాకీపడిందన్నారు.

Also Read:23 నుంచి శాస‌న‌స‌భ స‌మావేశాలు..

- Advertisement -