రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా?

16
- Advertisement -

రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? చెప్పాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి, విధానాల రూపకల్పన మీద ఉండదా?,ఏడు నెలల నుండి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరిక లేదా? అన్నారు.

ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారు.. డిసెంబరు 9న రూ.15 వేల రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీది రాతలే అని తేలిపోయిందన్నారు. ఇప్పుడు రైతుభరోసాకు విధి, విధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎందుకు రైతుభరోసాను పరిమితం చేస్తామని, సమీక్ష చేస్తామని చెప్పలేదు ? అన్నారు.

రైతుభరోసాకు దిక్కు లేదు. కౌలు రైతుల ఊసులేదు. రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడు…వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయిందన్నారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలి..కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతుందన్నారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతుభరోసాపై తీర్మానం చేయాలి…రైతుభీమా ఉంచుతారా ? ఎత్తేస్తారా ? తేల్చిచెప్పాలన్నారు. రైతుకూలీలకు రూ.12000, కౌలు రైతులకు రూ.15000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలి..అబద్దపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతుందన్నారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.

Also Read:యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌..యేవ‌మ్

- Advertisement -