రుణమాఫీపై ఆంక్షలా?:నిరంజన్‌ రెడ్డి

6
- Advertisement -

రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి యోజన ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయం సరికాదన్నారు. అందరికీ రైతుబంధు,రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం మూడు విడుతల్లో ఇచ్చేది రూ.6 వేలు మాత్రమేనని… రాష్ట్రంలో 70 లక్షల మందికిపైగా రైతులు ఉండగా, కేంద్రం గరిష్టంగా 36.1 లక్షల మంది రైతులకే అమలు చేసిందని వెల్లడించారు. కేసీఆర్‌ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పారు. ఇందులో భాగంగా 11 విడుతల్లో రైతుల ఖాతాల్లో రూ.72,910 కోట్లు జమచేశామని తెలిపారు.

రైతుల పట్ల కాంగ్రెస్ చిన్న చూపు చూస్తోందని…సాగునీళ్లు, కరెంటు, పంటల కొనుగోళ్లలో రైతాంగాన్ని ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

Also Read:ప్రమాణ స్వీకారం..తెల్లారే రాజీనామా!

- Advertisement -