- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటిరకు సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లగా ఆయన పదవీకాలం జూన్‌తో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్‌ని నియమించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించగా ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read:ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రక్షణ
- Advertisement -