మావోయిస్టులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎన్కౌంటర్ మరోవైపు లొంగుబాటు వెరసీ మావోయిస్టు పార్టీ రోజురోజుకు బలహీన పడుతోంది. తాజాగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం “నియాద్ నెల్ల నార్” పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం తో మావోయిస్టు లు లొంగిపోవడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్.
జిల్లా సుక్మా ప్రాంతంలోని PLGA బెటాలియన్ లో క్రియాశీలంగా ఉన్న ఇద్దరు నక్సలైట్ జంటలతో సహా మొత్తం 09 మంది హార్డ్‌కోర్ నక్సలైట్లు లొంగిపోయారు.లొంగిపోయిన నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ.52 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించింది.
లొంగిపోయిన ఇద్దరు పురుషులు, నలుగురు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ.08 లక్షలు, ఒక మహిళా మావోయిస్టు పై 2 లక్షలు ఇద్దరు మహిళా నక్సలైట్లపై ఒక్కొక్కరికి లక్ష చొప్పున ప్రభుత్వం రివార్డు ప్రకటించగా ఆ రివార్డును వారికి అందజేశారు.
Also Read:బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
సుక్మా జిల్లా సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు DRG, నక్సల్ సెల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ టీమ్, పోలీస్ స్టేషన్ చింతగుఫా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సుక్మా 02 కార్ప్స్ CRPF, 204 కోబ్రా కార్ప్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వారు ఈ నక్సలైట్లను లొంగిపోయేలా ప్రోత్సహించడంలో ప్రత్యేక పాత్ర పోషించాయి.