నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో రెండు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో కి వచ్చాయి. ఈ పరికరాలను నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప గారు ప్రారంభించారు. పరికరాల మొత్తం విలువ సుమారు రూ. 2 కోట్లు.
Karl Storz 4K TL-400 Rubina laparoscopic tower with ICG సిస్టమ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీల సమయంలో హై-డెఫినిషన్ విజువలైజేషన్ మరియు నియర్-ఇన్‌ఫ్రారెడ్ ఫ్లోరసెన్స్ ఇమేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితంగా మరియు సురక్షితంగా చేయగలుగుతారు.
Olympus CV-170 Endoscopy & Colonoscopy System అత్యుత్తమ చిత్ర నాణ్యతను అందిస్తూ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధుల తీవ్రతను ముందుగానే గుర్తించడం మరియు చికిత్సను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరికరం శస్త్రచికిత్స సమయంలో మరియు ఆ తర్వాతి దశల్లో కూడా వైద్యులకు మెరుగైన క్లినికల్ అవగాహనను అందిస్తుంది.
డైరెక్టర్ బీరప్ప గారు మాట్లాడుతూ, ఈ ఆధునిక పరికరాల ప్రవేశంతో విభాగంలోని శస్త్రచికిత్సలు మరియు ఎండోస్కోపిక్ విధానాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించే అవకాశం కలిగిందనీ, రోగుల నిర్ధారణ మరియు చికిత్సలో ఖచ్చితత్వం, భద్రత, మరియు సమర్థత మరింతగా పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రోలాజీ విభాగం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

