ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని తేల్చిచెప్పారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందని …ఆ బాధ్యతలను కొత్తగా వచ్చే ఎన్నికల అధికారి నిర్వహిస్తారని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని… పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని..రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
ఏకగ్రీవాలు జరిగిన చోట బెదిరింపుల వల్ల నామినేషన్లను దాఖలు చేయలేకపోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ ఆదేశాలిస్తున్నామని తెలిపారు.