USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు

18
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలి విజయం సాధించింది నిక్కీ హేలి. వాషింగ్టన్ డీసీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై గెలుపొంది తొలి విజయాన్ని నమోదు చేశారు నిక్కీ హేలీ. ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ట్రంప్‌పై భారత సంతతికి చెందిన హేలీ గెలుపొందారు.

వాషింగ్టన్‌ డీసీలో ఉన్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీకి 63 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 33.2 శాతం ఓట్లు వచ్చాయి. ఇడాహో, మిస్సోరీ, మిషిగన్‌లో జరిగిన ప్రైమరీలో నిక్కీ హేలీపై ట్రంప్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే.

అయితే ట్రంప్‌కు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 244కు చేరగా నిక్కీ హేలీకి 24 మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం.

Also Read:KTR:ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ ఏమైంది?

- Advertisement -