అమెరికా రాయబారి నిక్కీహేలీ ఫైర్ అవుతొన్నారు. దానికి కారణం.. ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకంలో..నిక్కీకి ట్రంప్‌తో అఫైర్ ఉందని మైకేల్ ఊల్ఫ్ పేర్కొనడమే. దీంతో నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అఫైర్ ఉందంటూ వదంతులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్ తో ఒంటరిగా గడపలేదని స్ఫష్టం చేశారు.
ట్రంప్‌తో అఫైర్ అని వ్యాఖ్యలు చేయడం చాలా అసహ్యంగా ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం నిర్దేశించిన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో,ఓవల్ కార్యాలయంలో నిక్కీ చాలా సేపు ఒంటరిగా గడిపారని ఊల్ఫ్ పుస్తకంలో రాశారు. ఇది పూర్తిగా అబద్దమని ఆమె మండిపడ్డారు. తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్ తో తన భవిష్యత్ గురించి చర్చించలేదనీ, ఎయిర్‌ఫోర్స్ వన్‌లో తాను ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారని తెలిపారు.
అలాగే ఓవల్ కార్యాలయంలో కూడా ట్రంప్‌తో తన రాజకీయ భవిష్యత్తు గురించే మాట్లాడానని అన్నారు. విజయవంతమైన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని పేర్కొన్నారు. కాగా..ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ‘ఉపాధి’ పనులపై 76 శాతం మంది అమెరికన్లు సంతృప్తిగా ఉన్నారని నిక్కీహేలీ తెలిపారు.