ఆకట్టుకుంటున్న’18 పేజెస్’ ఫస్ట్‌ లుక్‌..

230
18 Pages first look
- Advertisement -

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రంగా ’18 పేజెస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం. విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది.

అయితే ఈ రోజున నిఖిల్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసింది. నాయకా నాయికల మధ్య గల ఫీలింగ్స్ కి అద్దం పడుతూ వదిలిన ఈ ఫస్టులుక్, యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నిఖిల్ నుంచి ఈ ఏడాది రానున్న సినిమా ఇదే. అందువలన ఆయన ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

- Advertisement -