105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విజేతగా నిలిచారు నిఖిల్. రన్నరప్‌గా గౌతమ్ నిలిచారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి విన్నర్‌కి టైటిల్ ఇవ్వగా తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి సైతం ఈ ఫినాలేకు రావడం విశేషం.
105 రోజులు నా అన్నవాళ్లను వదిలేసి ఒక ఇంట్లో ఉండటం మాటలు కాదు.. నిజంగా చాలా ఎమోషన్స్ ఉంటాయి. నాగ్ సార్ జర్నీ వీడియోలో శేఖర్ గారి బాబు పుట్టాడన్న వీడియో చూడగానే.. ఒక్క క్షణం నాకు నా కూతురు గుర్తొచ్చింది అన్నాడు రామ్ చరణ్. వెంటనే వెళ్లి చూడాలనిపించింది. నిజంగానే అంత ధైర్యం తెచ్చుకుని, ఇలాంటి ఇంట్లోకి అడుగుపెట్టడమే విజయం లాంటిది.. మీ అంతా గ్రేట్ అని ప్రశంసలు గుప్పించారు చరణ్.
థాంక్యూ అందరికీ.. ముఖ్యంగా కంటెస్టెంట్స్‌కి థాంక్యూ.. నవ్వుతూ, ఏడుస్తూ, తిట్టుకుని, కొట్టుకుని ఇక్కడి దాకా వచ్చాం.. మీ అందరిలో ఒక్కొక్కరి దగ్గర నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను అని చెప్పాడు నిఖిల్. ఇది నా జీవితంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. బయటికి వెళ్లిన తర్వాత కూడా నేను అందరినీ కలుస్తాను. అని చెప్పాడు.
అమ్మా నాన్నా మీరేం బాధపడకండి.. నేనేం బాధపడటం లేదు.. నా జీవితంలో నా ప్రతి ఒక్క అడుగు మిమ్మల్ని గర్వంగా నిలబెట్టడానికే వేస్తాను అన్నాడు గౌతమ్.
Also Read:డైరెక్టర్సే నాకు గురువులు :అజయ్ అరసాడ