Nikhil: స్వయంభు..అప్‌డేట్

2
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన ఈ సినిమా పలు కారణాలతో కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తామని గతంలో నిఖిల్ స్పష్టం చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. గత రెండు వారాలుగా డబ్బింగ్ చెబుతున్నట్లు నిఖిల్ వెల్లడించారు. ఈ మేరకు డబ్బింగ్ సెషన్‌లో పాల్గొన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పక్కాగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది.

Also Read:బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఎందుకు?

ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాగోర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ భాషలతో కలిపి మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

- Advertisement -