భ‌విష్య‌త్తు ఉండదు నిఖిల్..జర జాగ్రత్త!

53
- Advertisement -

ఇటీవలే ‘స్పై’ చిత్రంతో అభిమానుల్ని అలరించిన హీరో నిఖిల్.. తాజాగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో నిఖిల్ భ‌విష్య‌త్తులో క్వాలిటీ విష‌యంలో అస‌లు కాంప్ర‌మైజ్ కాబోన‌ని మాటిచ్చాడు. కాంట్రాక్ట్‌తో పాటు కంటెంట్ డిలే వ‌ల్ల హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌లేక‌పోయామ‌ని నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే, నిఖిల్ పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ‘స్పై’ సినిమా నిర్మాతను నిఖిల్ బాగా ఇబ్బంది పెట్టాడు అని, ఆస్తులు అమ్ముకుని సినిమాని తీస్తే.. నిఖిల్ మాత్రం చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాడని టాక్.

ముఖ్యంగా ‘స్పై’ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వాలి. మొదట దానికి అడ్డు పడ్డాడు. అలాగే ప్రమోషన్స్ విషయంలోనూ నిఖిల్ బిహేవియర్ ఏ మాత్రం బాగాలేదు అని, ఎంత రిక్వెస్ట్ చేసినా.. ప్రమోషన్స్ కు సరైన సమయానికి రాడు అని, పైగా ప్రమోషన్స్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అని ఆరోపణలున్నాయి. గతనెల 29న విడుదలైన ఈ స్పై సినిమా నిజానికి ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ను చేరుకుంది. స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాలకు, మిడ్ రేంజ్ సినిమాలకు ఉన్న మార్కెట్ ను బట్టి.. స్పై సినిమా సక్సెస్ అయినట్టే.

Also Read:పవార్‌తో మొదలు..పవార్‌తోనే ముగింపు

మరి సక్సెస్ అయిన సినిమా గురించి ఎలా చెప్పాలి?, మా సినిమా అద్భుతం, బాగా ఆడుతుంది అని ప్రమోట్ చేయాలి కదా. మరి నిఖిల్ ఎలా ప్రమోట్ చేస్తున్నాడు ?. మా సినిమా బాగాలేదు అని అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాడు. హిట్ అయిన సినిమా, పైగా ఇంకా థియేటర్స్ లో ఆడుతున్న సినిమా గురించి ఇలా ఎవరైనా చెబుతారా?, పైగా భ‌విష్య‌త్తులో క్వాలిటీ విష‌యంలో అస‌లు కాంప్ర‌మైజ్ కాడు అట, ఇలాంటి బిహేవియర్ ఉంటే.. భ‌విష్య‌త్తు ఉండదు నిఖిల్. జర జాగ్రత్త!!.

ఈ స్పై సినిమలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు.

Also  Read:సమంత ప్రేమాయణంపై మరో పుకారు

- Advertisement -