థాంక్యూ…రిలీజ్ డేట్ ఛేంజ్!

72
- Advertisement -

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికాగోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. . ఇప్పటికే ట్రైలర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని తెచ్చుకున్నాయి.

తొలుత ఈ సినిమాను జూలై 8న విడుదల చేస్తామని ప్రకటించగా తాజాగా రిలీజ్ డేట్ ఛేంజ్ అయింది. సినిమాని జూలై 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే రోజు ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న నిఖిల్ కార్తికేయ 2 కూడా రిలీజ్ కానుంది. దీంతో కార్తీకేయ 2తో పోటీ పడనున్నాడు చైతూ. వీరిద్దరి పోరులో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి…

- Advertisement -