Nikhil:ఓటీటీలో నిఖిల్ స్పై

41
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయిక గా నటించింది. జూన్ 29న సినిమాల రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఇవాళ్టి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓటీటీలోకి వచ్చింది స్పై.

Also Read:వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారులు..

స్పై తర్వాత నాలుగు సినిమాలకు ఓకే చెప్పారు నిఖిల్. వీటిలో మూడు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఒకటి ఫాంటసీ డ్రామాతో రాబోతున్న ‘స్వయంభు’. ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రాబోతుంది.

Also Read:వర్షాలను రాజకీయం చేయొద్దు: కేటీఆర్

- Advertisement -