యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నిఖిల్ కెరీర్లో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది స్పై.
అయితే వాస్తవానికి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు కానీ సాధ్య పడలేదు. అలాగే ఓవర్సీస్ ప్రీమియర్లు కూడా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి.
Also Read:రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..
ఈ నేపథ్యంలో ఓవర్సిస్ ప్రేక్షకులకు సారీ చెబుతూ అలాగే గ్రాండ్ సక్సెస్ సాధించినందుకు ఓ లేఖను రిలీజ్ చేశారు. నా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చేలా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, కంటెంట్ డిలే వల్ల షోలు రద్దయ్యాయి. ఓవర్సీస్ లోనూ 350 ప్రీమియర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. నా రాబోయే మూడు సినిమాలు టైం ప్రకారం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని అన్ని భాషల్లో రిలీజవుతా…ఎంత ఒత్తిడి వచ్చినా నాణ్యత విషయంలో రాజీపడనని చెప్పారు.
Also Read:KTR:పురపాలిక శాఖ దశాబ్ది నివేదిక