హీరో జగపతిబాబుతో జరిగిన టైటిల్ పోరులో వెనక్కి తగ్గారు యంగ్ హీరో నిఖిల్. నిర్మాత నట్టికుమార్.. హీరో నిఖిల్‌పై అసహనం వ్యక్తం చేయడం.. ఇద్దరి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ‘ముద్ర’ టైటిల్‌ను వదులుకుని కొత్త టైటిల్‌తో ముందుకురానున్నాడు.
ఈ మేరకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ముద్రను కాస్త ‘అర్జున్ సురవరం’గా మార్చేశాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ కణితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుండగా మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివరిదశలో ఉంది. అద్భుతమైన ఔట్ పుట్ ఇవ్వడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఈ చిత్రంలో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
#ArjunSuravaram#FreshPoster is here
Coming to Theatres this March 29th.
Plz Do spread the Word 😀🙏 pic.twitter.com/hsUwx5QvJx— Nikhil Siddhartha (@actor_Nikhil) February 4, 2019