కార్తికేయ 2..ఓటీటీ డేట్ ఫిక్స్‌!

110
nikhil
- Advertisement -

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ . గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరియర్లో…బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు అన్ని భాషల్లో కలిపి రూ. 100 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 భారీ రేటుకు కొనుగోలు చేసింది.

కార్తికేయ-2 చిత్రాన్ని అన్ని భాషల్లో సెప్టెంబర్ 30 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట రెడీ అవుతోందట. నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా శ్రీనివాస రెడ్డి, వైవా హర్షా, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాళభైరవ సంగీతాన్ని అందించారు.

- Advertisement -