విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో స్థిరమైన స్థానం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి కార్తికేయ. ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 కూడా వచ్చేసింది.
ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టారు కార్తికేయ. మొదటి రోజు యాభై షోలు ఉంటే.. మూడో రోజుకు మూడొందల షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటివరకు 11 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 300k డాలర్లను వసూల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక హాఫ్ మిలియన్, మిలియన్ డాలర్ల క్లబ్బులోనూ ఈ చిత్రం త్వరలోనే చేరేట్టు కనిపిస్తోంది. ఇక హిందీ బెల్టులో మొదటి రోజు 8 లక్షలు వస్తే.. రెండో రోజు దాదాపు 30 లక్షల వరకు వచ్చినట్టు సమాచారం..