నిఖిల్ కిర్రాక్ పార్టీ లుక్ అదుర్స్

248
nikhil-
- Advertisement -

యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఏ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా దూసుకుపోతున్న హీరో ‘నిఖిల్’. లాంగ్ బ్యాక్ కెరీర్ ని స్టార్ట్ చేసి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొదటిలో పెద్దగా గుర్తింపు రాకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నిఖిల్. ‘శేఖర్ కమ్ముల’ డైరెక్షన్ లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాలో ఉన్న నలుగురి హీరోల్లో ఒకడిగా నటించాడు ‘నిఖిల్’. స్టూడెంట్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తూ తీసిన ‘హ్యాపీ డేస్’ సినిమా ‘నిఖిల్’ కి మంచి గుర్తింపు ఇచ్చింది.

Nikhil

ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా అనే థ్రిల్ల‌ర్ మూవీతో అల‌రించిన‌ నిఖిల్, ఆ త‌ర్వాత కేశ‌వ అనే రివెంజ్ డ్రామా చిత్రంతో అల‌రించాడు. ఇక ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రాన్ని కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం క‌న్నడ హిట్ చిత్రం కిరిక్ పార్టీ రీమేక్ కాగా, ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై డెబ్యూ ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వెరైటీ క‌థాంశంతో ఈ మూవీ రూపొందుతుండ‌గా, తాజాగా ప్రీ లుక్ విడుద‌ల చేసింది మూవీ యూనిట్‌.

Nikhil

ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో గోడ‌ల‌పై ఓట్ ఫర్ కృష్ణ .. రివొల్యూషన్ .. బీ ఏ రెబల్ అనే కొటేష‌న్స్ తో పాటు చెగువేరా, క్రికెట్ బ్యాట్ ఉన్నాయి. ఇక రేపు సాయంత్రం 5గం.ల‌కు చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్రీ లుక్ ద్వారా తెలిపింది చిత్ర బృందం. నిఖిల్ 15వ చిత్రంగా తెర‌కెక్కుతున్నఈ మూవీ లో సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అజ‌నీష్ లొక‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -