ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నిఖిల్. ఇప్పటికే కార్తికేయ – 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న నిఖిల్ ఓ పాన్ ఇండియా చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కార్తికేయ 2కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
గతంలో కార్తికేయ హిందీ డబ్బింగ్ చిత్రానికి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు కార్తికేయ-2 సినిమాను హిందీలోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తుండగా నిఖిల్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చేప్పబోతున్నారట.
ఒకవేళ ఇది నిజమైతే కార్తికేయ హిందీ ఫ్యాన్స్‌కు ఇది పండగే అని చెప్పాలి. థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉండటమే ఈ సినిమాకు బలంగా మారనుండటంతో, దర్శకుడు చందూ ముండేటి ఈసారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను పట్టుకొస్తున్నాడు. జూలై 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.