నిఖిల్…’అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

5
- Advertisement -

కార్తికేయ 2 చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ క‌థానాయకుడిగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమా కావ‌టం విశేషం.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి త‌మ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. కారుకు సంబంధించిన అంశాల‌ను ఇందులో ఉన్నాయ‌ని తెలుస్తుంది.

ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే హీరో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వ‌సంత్ న‌డుస్తూ వ‌స్తున్నారు. నిఖిల్ స్టైలిష్ లుక్‌ను ఉంటే, రుక్మిణి వ‌సంత్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఫ‌స్ట్ లుక్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. స్వామిరారా, కేశ‌వ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల త‌ర్వాత నిఖిల్, సుధీర్ వ‌ర్మ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా కావ‌టంతో ఆడియెన్స్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావ‌టంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్ట‌టానికి సంసిద్ధ‌మ‌య్యారు.

క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో మంచి పాపుల‌ర్ హీరోయిన్‌గా అంద‌రినీ అల‌రిస్తోన్న రుక్మిణి వ‌సంత్ .. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. మ‌రో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. హ‌ర్ష చెముడు ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్ షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్స్‌. బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

- Advertisement -