ఓటీటీ బాటలో నిఖిల్ మూవీ..!

151
nikhil 18 pages
- Advertisement -

టాలీవుడ్‌లో యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ’18 పేజెస్’ సినిమాల్లో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ’18 పేజెస్’ షూటింగును పూర్తిచేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. సుకుమార్ కథ అందించగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

అయితే ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. థియేటర్లు ఓపెన్ అయినా, లైన్లో చాలానే సినిమాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమాను ఓటీటీ వైపు తీసుకెళదామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -