నందమూరి తారకరత్న మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తారకరత్న కన్నుమూసి నెలరోజులు అవుతున్నప్పటికీ.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇంకా ఆ విషాదకర సంఘటన నుంచి బయటకు రాలేదు. నిత్యం తన భర్తనే తలుచుకుంటూ కుమిలిపోతోంది. తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది. అయితే, తాజాగా బాలయ్య బాబు గురించి అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇంతకీ, అలేఖ్య రెడ్డి బాలయ్య గురించి ఏం పోస్ట్ చేసింది అంటే.. ‘(తన భర్త తారకరత్నతో మాట్లాడుతున్నట్లు) మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి (నందమూరి బాలకృష్ణ గారు). కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. నిన్ను ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఓబు (తారకరత్న).
ఆయన (బాలయ్య) ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్’ అని అలేఖ్య రెడ్డి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే తారకరత్నను బతికించుకోవడానికి బాలయ్య గట్టి ప్రయత్నాలే చేశాడు. ప్రస్తుతం తారకరత్న ఫ్యామిలీకి బాలయ్య అండగా నిలబడ్డాడు. తారకరత్న పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలో అన్నీ పనులు బాలయ్య చేశాడట. నిజంగా ఇది బాలయ్య గొప్పతనమే !
ఇవి కూడా చదవండి…