మెగా డాటర్ నిహారిక, హీరో సుమంత్ అశ్విన్ జంటగా తెరకెక్కిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. చాలా రోజుల తర్వాత నిహారిక మళ్లి సినిమాలో కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటివలే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈమూవీకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా..యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించారు.
ముందుగా చెప్పిన ప్రకారమే హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. మరో సారి పల్లె టూరి ప్రేమలో నిహారిక కనిపించనున్నట్లు తెలుస్తుంది. జులై లో ఈమూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ట్రైలర్ లో ఉన్న డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమాకు శక్తికాంత్ సంగీతం అందించగా..థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించాడు.
ఈచిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా ఇటివలే ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక నిహారిక చాలా రోజుల తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. నిహారిక నటించిన ఒక మనసు సినిమా ప్లాప్ అయినా ఆమె నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది. వచ్చే నెలలో రాబోతున్న హ్యాపి వెడ్డింగ్ సినిమాతో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.