‘సూర్యకాంతం’గా మెగా హీరోయిన్‌..

256
Niharika Konidela As Surya Kaantham
- Advertisement -

ఎంతో మంది యువ హీరోలు ఉన్న మెగా ఫ్యామిలి నుండి మొదటి హీరోయిన్ గా నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమా ఒక మనసు అంతగా హిట్ కాకపోయినా వెబ్ సిరీస్ లతో అలాగే రియాలిటీ షోలతో నిహారిక తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఒక మనసు’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుంది.

Niharika Konidela As Surya Kaantham

ఇక ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలను అంగీకరిస్తూ వెళుతోంది. తెలుగులో సుమంత్ అశ్విన్ తో ‘హ్యాపీ వెడ్డింగ్’ షూటింగును పూర్తి చేసిన నిహారిక, ఓ తమిళ సినిమాతోను అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె ‘సూర్యకాంతం’ అనే సినిమాను చేయనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నిహారిక ప్రధాన పాత్రగా ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రణీత్, ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. అదిత్ అరుణ్ .. కాళిదాస్ అనే కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

- Advertisement -