అల్లు అర్జున్ మూవీలో మెగా డాటర్

773
Allu Arjun Niharika
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీలో పూజా హెగ్డె, నివేధా పేతురాజ్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం 2020సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

అయితే ఈమూవీ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా అయిపోగానే సుకుమార్ తో మూవీ చేయనున్నాడు బన్నీ. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈమూవీలో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందని ఫిలీం నగర్ వర్గాల టాక్.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను నిహారిక అయితే బాగుంటుందని బన్నీతో సుకుమార్ అనడంతో, బన్నీ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. నిహారిక హీరోయిన్ గా మూడు సినిమాలు చేసినా అవి అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఆమె హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసి వెబ్ సీరిస్ లలో నటిస్తుంది. ఇక ఈసినిమాలో నిహారిక పాత్రపై క్లారీటి రావాల్సి ఉంది.

- Advertisement -