ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసిన మేకర్స్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు.
మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సముద్రతీరంలో హీరో మంచంపై నిద్రపొతుండగా.. ”చాలా ప్రశాంతంగా వున్న ఇతని జీవితంలోకి ఒక రోజు నిద్రముంచుకొచ్చింది నాయిన” అనే వాయిస్ వినిపిస్తూ..వచ్చింది నిదరే అయినా అది ప్రమాదకరం అనే అర్ధం వచ్చేట్లు డేంజర్ బోర్డ్ చూపించడం.. తర్వాత బుర్రకథ స్టైల్ లో వినిపించిన కొన్ని లైన్స్ చాలా క్యూరియాసిటీని పెంచాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే.. చిత్రాలు చేశాను. ఇప్పుడు కథానాయకుడిగా ”నిదురించు జహాపన’ చేస్తున్నాను. మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇది గ్రేట్ జర్నీ. అనూప్ రూబెన్స్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రసన్న చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది. జీవితాంతం సినిమాల్లోనే వుంటాను. సినిమా నా ప్రాణం. మీ అందరినీ అలరించడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను”అన్నారు.
ప్రసన్న కుమార్ దేవరపల్లి మాట్లాడుతూ.. ఒక మనిషి నిద్రపోయిన తర్వాత కలలు వస్తాయి. ఐతే ఆ కల గురించి ఓ పది నిమషాలు చెప్పుకుంటాం. మిగతా సమయం అంతా ఏం జరుగుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే ఈ సినిమాలో మా హీరో ఆరు నెలలు కంటిన్యూస్ నిద్రపోతూనే వుంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. దాదాపు సముద్ర నేపధ్యంలో సాగే కథ ఇది. ఈ ప్రయాణంలో చాలా సవాళ్ళు ఎదురుకున్నాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. ఆనంద్ వర్ధన్ డైరెక్టర్స్ హీరో. చాలా చక్కగా నటించారు. చిన్నప్పుడు తను బాలనటుడిగా చేసిన అనుభవం అంతా ఇందులో కనిపిస్తుంది. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది.” అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. దర్శకుడు ప్రసన్న, హీరో ఆనంద్ వర్ధన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రసన్న చాలా మంచి దర్శకుడు అవుతారు. కథ చాలా నచ్చింది. పాటలన్నీ బాగా వచ్చాయి. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఎంటర్ టైన్ చేస్తుంది” అన్నారు.
రోష్ని సాహోత మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా స్పెషల్ మూవీ ఇది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అన్నారు.
నవమి గయాక్ మాట్లాడుతూ ..ఈ సినిమా కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆనంద్ తో పాటు మిగతా యూనిట్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
Also Read: పిక్ టాక్ : బోల్డ్ లుక్ లో గ్లామర్ ఫోజులు
రామరాజు, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆనంద రెడ్డి నడకట్ల కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి వెంకట్, నానిబాబు కారుమంచి ఎడిటర్స్.
Also Read: పవన్ సినిమాల పై లేటెస్ట్ అప్ డేట్స్