ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిధి అగ‌ర్వాల్‌ షాకింగ్ కామెంట్స్..

21

అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా `హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మంగ‌ళ‌వారంనాడు విలేక‌ర‌కుల‌తో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

-శ్రీ‌రామ్ ఆదిత్య గారు ఓ సారి క‌థ చెప్ప‌డానికి పిలిచారు. బ‌య‌ట ఆయ‌న సినిమాల గురించి విన్నాను. ఆయ‌న క‌థ చెప్ప‌గానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. అయినా సాంగ్స్ వున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్న క‌థ బిన్నంగా అనిపించింది.

-పెద్ద స్టార్స్‌తో న‌టించినా గ‌ల్లా అశోక్ తో న‌టించ‌డం క‌ష్టం అనిపించ‌లేదు. త‌ను హీరోగా ప్రిపేర్ అయి వున్నాడు. అందుకే న‌టుడిగా కొత్త‌వాడ‌నే ఫీల్ నాకు క‌ల‌గ‌లేదు.

-ఇస్మార్ట్ శంక‌ర్‌లో డాక్ట‌ర్‌గా చేశాను. హీరో సినిమాలోనూ అలాంటి పాత్రే వ‌చ్చింది. కానీ తేడా వుంటుంది. నా పేరు సుబ్బు. నా ఫాద‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబుగారు. హీరో తండ్రిగా న‌రేశ్ గారు న‌టించారు. ఈ క‌థ రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగే డ్రామా. సంద‌ర్భానుసారంగా కామెడీ కూడా వుంది. క‌థ‌లో కొన్ని ట్విస్ట్‌లుకూడా వున్నాయి.

-ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల చాలా గేప్ వ‌చ్చింది. అందుకే తెలుగులో చేయ‌లేక‌పోయా. కానీ హిందీ, త‌మిళ సినిమాలో పాల్గొన్నా.

-నేను క‌థ విన్న‌ప్పుడు నా పాత్ర‌వ‌ర‌కే ఆలోచిస్తాను. న‌ట‌నా ప‌రంగా ఎంత‌మేర న్యాయం చేయ‌గ‌ల‌నే చూస్తాను. గ‌ల్లా అశోక్ కొత్త అనే ఫీల్ నాకు క‌ల‌గ‌లేదు. నేను ఆయ‌న‌కు ఏమీ హెల్ప్ చేయ‌లేదుకానీ డాన్స్ ప‌రంగా కొంచెం త‌ను హెల్ప్ చేశాడు.

-ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న పెద్ద హీరోల‌నే తేడా లేకుండా ద‌ర్శ‌కుడు నాపై వుంచిన న‌మ్మ‌కాన్ని నిలబెట్టేలా చేస్తాను.

-నేను డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయాల‌నే చూస్తాను. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా.

-నేను పుట్టింది హైద‌రాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా క‌నెక్ట్ అయ్యాను. హిందీ, త‌మిళ సినిమాలు చేసినా తెలుగు ప‌రిశ్ర‌మ అంటేనే నాకు చాలా ఇష్టం.

-షూటింగ్ వుంటే సెట్‌కు వెళ్ళి ప‌ని చేయాలి. హ్యాపీగా వుండాలి. న‌టిగా ఇంకా మెచ్చూర్డ్‌గా పాత్ర‌లు ఎంచుకోవాలి అనేది గ‌మ‌నిస్తాను. షూట్ లేన‌ప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ వుంది అదేవిధంగా ఛారిట‌బుల్ పౌండేష‌న్ వుంది అవి కూడా చూస్తుంటాను.

-ఇస్మార్ట్ చేశాక గ్లామ‌ర్ హీరోయిన్ అనే పేరు నాపై వుంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డం అనేది కూడా నాకు ప్ల‌స్ పాయింటే. త‌మిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అందులో కేరెక్ట‌ర్‌కు మేక‌ప్ వుండ‌దు. డ‌ల్ వాతావ‌ర‌ణంలో ఫేస్ డ‌ల్‌గా క‌నిపించాలి. ఇలాంటి పాత్ర‌లు ద‌ర్శ‌కుల నుంచి పుట్టిన‌వే. ఇలాంటి ఏ భాష‌లో వ‌చ్చినా చేస్తాను.

-నాకు యాక్ష‌న్ పాత్ర‌లంటే ఇష్టం. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో కొంచెం యాక్ష‌న్ సీన్స్ వున్నాయి. చాలా ఇష్టంగా చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాన్‌లో నేను గ‌మ‌నించింది ఏమంటే, చాలా కూల్‌గా వుంటారు. ప‌వన్ సార్ సినిమాలో పెద్ద రోల్‌. బెస్ట్ రోల్ నాకు ద‌క్కింది. ఇది పీరియాడిక్ మూవీ. చాలా బాగుంది.

-అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ మంచి న‌టులు. వారితోపాటు కొత్త హీరోల‌తో కూడా నేను న‌టిస్తాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మ‌ర‌లా న‌టించాల‌ని మాత్రం వుంది.

-సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే డిఫ‌రెంట్ ద‌ర్శ‌కులు ఆలోచ‌న‌లు, ఏదో ఒక‌టి నేర్చుకునేలా వుంటుంది.

  • ఓటీటీల‌లో వినూత్న‌మైన క‌థ‌లు వ‌స్తున్నాయి. వాటిని చాలా చూశాను. నాకు ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వెండితెర‌కే ముందు ప్రాధాన్య‌త ఇస్తా. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రూస్టోరీస్‌.. సీరిస్ నాకు బాగా న‌చ్చింది.

-హీరో సినిమాలో గ‌ల్లా అశోక్ అద్భుతంగా న‌టించాడు. ఇది సంక్రాంతికి ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ. సాంగ్స్ బాగా వ‌చ్చాయి. లాగ్ లేకుండా ఎడిట‌ర్ బాగా డీల్ చేశాడు. అమ‌ర్ రాజా ప్రొడ‌క్ష‌న్ లో చేయ‌డం ప‌ద్మ గ‌ల్లాగారి తో ప‌నిచేయ‌డం ఆనందంగా వుంది. నా ఇష్ట‌మైన కెమెరామెన్ స‌మీర్ రెడ్డిగారితో ప‌నిచేశాను.

-నేను సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాను. న‌టికాక‌ముందే నాకు ఒన్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వున్నారు. సోష‌ల్‌మీడియా వ‌ల్ల నా ఫొటోలు చూసి నేను ప‌లానా పాత్ర‌కు స‌రిపోతాన‌ని కొంద‌రు ద‌ర్శ‌కులు పిలుస్తుంటారు. ఇది నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఇక ప‌లువురు విమ‌ర్శ‌లు కూడా ఘాటుగానే వుంటాయి. కాస్త ఇబ్బంది పెట్టినా వాటిని ప‌ట్టించుకోను.

-తెలుగులో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు త‌ర్వాత ఇంకా ఏమీ అన‌కోలేదు. కొన్ని క‌థ‌లు చ‌ర్చ‌ల్లో వున్నాయి. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేశాను. మ‌రో సినిమా లైన్‌లో వుంది.

-నేను పూర్తి శాఖా హారిని. ఇడ్లీ అంటే చాలా ఇష్టం. రోటీ, పెరుగ‌న్నం ఇష్టంగా తింటాను. మిస్ట‌ర్ మ‌జ్జు టైంలో కొంచెం లావు అయ్యాను. ఆ త‌ర్వాత త‌గ్గాను. ఇలా బాడీని మ‌లుచుకుంటుంటాను. అని ముగించారు.