జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అయినా తాను ఆశ్చర్యపోనని నటి నిధి అగర్వాల్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, ఆయన కష్టపడి చేసిన పోరాటమే ఈ స్థాయికి తీసుకువచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన విజయం సాధించడంతో అందరి దృష్టి ఆయనపై పడుతోంది. కానీ ఈ గుర్తింపు ఒక్కరోజులో రాలేదు. ఆయన ఎన్నో ఏళ్లుగా నిరంతరంగా శ్రమిస్తున్నారు అని నిధి అగర్వాల్ అన్నారు. ప్రజల సమస్యల కోసం ఆయన పోరాడిన విధానం, సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధతే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని ఆమె పేర్కొన్నారు.
రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నారని నిధి ప్రశంసించారు. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న ఆదరణ, ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలు చేపట్టేలా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం ఒక ప్రయాణమైతే, ఇప్పుడు ఆయన సాధిస్తున్న విజయాలు ఆ ప్రయాణానికి ఫలితమని నిధి అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఆయన లక్ష్యాలు, ఆలోచనలు దేశ స్థాయిలోనూ ప్రభావం చూపే అవకాశముందని ఆమె చెప్పుకొచ్చారు.

