నాగ చైతన్య కోసం నయా బ్యూటీ..

209
Nidhi Agarwal for Naga Chaitanya Savyasachi
- Advertisement -

ప్రేమమ్ – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న నాగ చైతన్య కెరీర్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ కొడదామని యుద్ధం శరణం సినిమాను ఎంతో ఇష్టపడి తీశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడంతో హ్యాట్రిక్ ఛాన్స్ ని మిస్ అయ్యాడు.

అయితే చైతు కథానాయకుడిగా చందూ మొండేటి ‘సవ్యసాచి’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి కూడా ఎంతో ప్రాముఖ్యత వుంటుందట. ఈ పాత్ర కోసం కొంతమంది కథానాయికలను పరిశీలించిన టీమ్, చివరిగా బాలీవుడ్‌ బ్యూటి నిధీ అగర్వాల్ ను ఎంపిక చేశారట.

Nidhi Agarwal for Naga Chaitanya Savyasachi

ఈ అమ్మడు బాలీవుడ్‌ హీరో టైగర్ ష్రాఫ్ జోడీగా ‘మున్నా మైఖేల్’ అనే మూవీతో నిధి అగర్వాల్ వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అమ్మడి గ్లామర్ కి బాగానే మార్కులు పడిపోయాయి. దాంతో ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సవ్యసాచి’ సినిమాను అంగీకరించింది. మాధవన్ కీలకమైన పాత్రను పోషించే ఈ సినిమా, ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

- Advertisement -