యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది నిధి. హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో జరుగుతోంది.
ఉదయం 6 గంటల నుంచే షూటింగ్ ప్రారంభమవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న నిధి అగర్వాల్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చి ఇక్కడ సాయంత్రం రాజా సాబ్ చిత్రీకరణలో జాయిన్ అవుతోంది.
ఇలా ఒక రోజులో ఈ రెండు సినిమాల షూటింగ్స్ చేస్తూ తీరిక లేకుండా ఉంది నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా ఒప్పందంలో భాగంగా తనకు ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కు సైన్ చేయలేక వదిలేస్తోంది నిధి అగర్వాల్. అయితే హరి హర వీరమల్లు సినిమా తనకు కోల్పోయిన మూవీస్ కంటే ఎక్కువగా గుర్తింపు, విజయాన్ని తీసుకొస్తుందని ఆమె నమ్ముతోంది. నిధి అగర్వాల్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుపుతోంది.
Also Read:ఎన్టీఆర్ మూడు అక్షరాల పేరు కాదు!