నేను అదే.. ఏం చేయాలి !

123
Nia Sharma's Instagram account hacked
Nia Sharma's Instagram account hacked

బాలీవుడ్ భామలు తమ అందాలతో ఆన్ లైన్ లో హంగామా చేయడం సర్వ సాధారణమే. ఇప్పుడు బుల్లితెర బ్యూటీ నియా శర్మ బాలీవుడ్ భామలను మించిపోతుంది. టాలీవుడ్ జనాలకు  గతంలో పెద్దగా పరిచయం లేదు కానీ.. ఈ మధ్య ఏషియా సెక్సియెస్ట్ ఉమన్ లిస్ట్ లో మూడో స్థానం సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను  ఓడించేసింది. ఇలా అనుకోకుండా వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు.. ఇన్ స్టాగ్రామ్ ను వేదికగా చేసుకున్న నియా శర్మ.. తన సోషల్ పేజ్ లో బోలెడన్ని హాట్ హాట్ ఫోటోస్  పెట్టేసింది. అయితే నియా నచ్చలేదా.. లేదా తన ఫోటోలు నచ్చలేదో కానీ.. సడెన్ గా ఈమె ఇన్ స్టా అకౌంట్ ను హ్యాక్ చేసేసి ప్రస్తుతం హైడ్ చేసేశారు. అంతే కాదు.. ఇలాంటి బిచ్ కు సోషల్  అకౌంట్ అవసరం లేదంటూ.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలెట్ చేస్తామని కూడా బెదిరించేశారు.

screen-shot

దీనికి ఈమె నుంచి వచ్చిన రియాక్షన్ ఇలా ఉంది. ‘‘అవును.. నేను బిచ్ నే కావచ్చు. కానీ నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను చాలా ప్రేమిస్తాను. ప్లీజ్ దాన్ని రిలీజ్ చేయండి. మీరు నా అకౌంట్ తో అడుకోవడం అయిపోతే రిలీజ్ చేసేయండి.నా శరీరంలో ఓ భాగం తెగిపడినట్టయింది. ఓ ఖాతానుస్తంభింపచేయడం వల్ల హ్యాకర్లకు ఒరిగే సంతోషం ఏముంటుంది? ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చాలా సంతోషంగా గడిపేదాన్ని… ఎప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు’’ అని నియా పేర్కొంది.